Sunday, February 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తండాలో ఘనంగా సేవాలాల్ జయంతి

తండాలో ఘనంగా సేవాలాల్ జయంతి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పెద్దగుల్లా తాండ, సావర్గావ్, మహమ్మదాబాద్ తండా, దోస్తు పల్లి తండా, మధుర తండా, డోన్గావ్ తండా, కేమ్రాజ్ కల్లాలి తాండ, పెద్ద ఏడ్గి తాండ, గ్రామంలో సేవాలాల్ జయంతి వేడుకలను గ్రామ సర్పంచ్ రాథోడ్ సుమతి యశ్ పాల్ ఆధ్వర్యంలో తాండ గిరిజనులతో కలిసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయంతి వేడుకలు సర్పంచ్ సుమతి యశ్ పాల్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి జయంతి వేడుకలను ప్రారంభించారు.

అంతకుముందు గ్రామంలోని సేవాలాల్ మందిరం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సేవాలాల్ జెండాను కుల పెద్దలు ఎగురవేశారు. తండాలో గిరిజనులు ప్రత్యేక దుస్తులు ధరించడంతో చూడ ముచ్చటగా కనిపించింది. తాండా మొత్తం పండుగ వాతావరణంలో కోలాహలంగా కనిపించింది. అనంతరం గ్రామస్తులతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదం కార్యక్రమంలో తాండవాసులు పాల్గొన్నారు. సేవాలాల్ జయంతి వేడుకల సందర్భంగా యువకులు యశ్ పాల్ మాట్లాడుతూ సేవాలాల్ ప్రబోధించిన మంచి మార్గాలలో నేర్చుకోవడం వల్ల మా ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చిందని ఆర్థికంగా మంచిగా స్థిరపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతి  యశ్పాల్ , మాజీ సర్పంచ్, మాజీ ఉపసర్పంచ్, మహిళలు, యువకులు , పెద్దలు,  చిన్నలు , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -