Sunday, February 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ గ్రామంలో శ్రీ సద్గురు సేవాలాల్ జయంతి వేడుకలు భక్తి మయంగా, ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం లంబాడి భక్తులు సద్గురువుకు ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి వారి మహిమలను స్మరించుకున్నారు. గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో ఇ వేడుకల్లో పాల్గొన్నారు. సద్గురు సేవాలాల్ జీవిత చరిత్ర, బోధనల గురించి చర్చలు జరిగాయి.

ప్రత్యేక అభిషేకాలు, పూజలతో భక్తి శ్రద్ధలతో పూజించి కున్నారు. ఈ సందర్భంగా లంబాడి సమాజ నాయకులు మాట్లాడుతూ.. సద్గురు సేవాలాల్ సేవా భావంతో సమాజానికి మార్గదర్శిగా నిలిచారని, ఈ జయంతి అందరికీ ప్రేరణగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ షబానా-గఫూర్ పాల్గోని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తి, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించింది. ఈ సందర్భంగా భూక్యా రమేష్, అజ్మీరా శ్రీధర్, రేవంత్ రాథోడ్, భూక్యా రాజు, అజ్మీరా రాజు, జోగి నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -