- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం పటిష్టంగా నిర్వహించే బంజారా ఆరాధ్య దైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆన్ సాన్ పల్లి గ్రామంలో సేవాలాల్ జయంతిని బంజారా యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో జెండా ఆవిష్కరణ చేసి యూత్ నాయకుడు బానోత్ రాజ్ కుమార్ (ఢిల్లీరాజు) మాట్లాడారు. బంజారా బిడ్డలు అభివృద్ధిలో మరింత పురోగతి సాధించాలని, సేవాలాల్ చూపిన మార్గాన్మి అనుసరిస్తూ, బంజారా సాంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా యువసేన నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



