నవతెలంగాణ – డిచ్ పల్లి
సేవలాల్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శశాంక్ హాస్పిటల్, శశాంక్ ఫౌండేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాట్లు శశాంక్ ఫౌండేషన్ అధినేత అర్థోపేటిక్ ఎంఎస్ సర్జన్ డాక్టర్ కేతావత్ మోతిలాల్ తెలిపారు. మంగళవారం డిచ్ పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్ను ఈ నేల 11, 12, తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ వాలీబాల్ టోర్నమెంట్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన ఏదైనా జట్టు పాల్గొనాలని, గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి రూ.10,000/ రెండవ బహుమతి రూ.6,000 ఉంటుందని గవర్నమెంట్ కు వచ్చే క్రీడాకారులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్థోపెడిక్ ఎంఎస్ సర్జన్ డాక్టర్ కేతావత్ మోతిలాల్ , ఎంబిబిఎస్ ,డిజిఓ డాక్టర్ కేతావత్ చంద్రకళ వివరించారు. ఆసక్తిగల జట్లు పాల్గొని కి టోర్నమెంట్ను విజయవంతం చేయాలని వారు కోరారు.



