Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సేవాలాల్ ఆలయ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి 

సేవాలాల్ ఆలయ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
సేవాలాల్ ఆలయ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి గిరిజనులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సేవాలాల్ సేన విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లావుడియా అనిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అనిల్ మాట్లాడుతూ.. గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి గత పాలకులు శంకుస్థాపనలు చేశారని తెలిపారు. 2026 ఫిబ్రవరిలో జరిగే సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలనాటికీ ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో  సేవాలాల్ విద్యార్థి సేన మండల నాయకులు దినేష్, వెంకటేష్, ప్రసాద్, పూజ, సంధ్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -