Sunday, October 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఔటర్‌ రింగు రోడ్డుపై ఏడు కార్లు ఢీ..

ఔటర్‌ రింగు రోడ్డుపై ఏడు కార్లు ఢీ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: హిమాయత్‌ సాగర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక ఒకటి వచ్చిన ఏడు కార్లు ఢీకొన్నాయి. ముందువెళ్తున్న కారు డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదానికి గురైన కార్లలో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న దారిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ఈ ఘటనతో దాదాపు 2కి.మీల మేర ట్రాఫిక్‌జామ్‌ అయింది. సమాచారం అందుకున్న పెట్రోలింగ్‌ సిబ్బంది, రాజేంద్రనగర్‌ పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ని క్లియర్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -