Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఏడుపాయల ఆలయ హుండీ లెక్కింపు

ఏడుపాయల ఆలయ హుండీ లెక్కింపు

- Advertisement -

ఆదాయం రూ.26  లక్షలు 59 వేలు
నవతెలంగాణ – పాపన్నపేట 

ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ హుండీ ఆదాయం రూ.26 లక్షల 59 వేల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ, అసిస్టెంట్ కమిషనర్ సులోచన , ఆలయ ఇంచార్జీ  ఇఓ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం 46రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమం శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ అధ్వర్యంలో గోకుల్ షేడ్ లో నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ  ప్రత్యేక అధికారి అసిస్టెంట్ కమిషనర్ సులోచన  పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. బంగారు, వెండి వస్తువుల మినహా నగదు రూపంలో రూ.26 లక్ష 59వేల 9 ఆదాయం ఏడుపాయల దేవాదాయ ధర్మాదాయ శాఖకు సమకురినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, శ్యామ్, శ్రీనివాస్ శర్మ, రాజు, రవి ,యాదగిరి, తోపాటు శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొనగా పాపన్న పేట పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img