యాషెస్‌లో తొలిరోజే 19వికెట్లు పతనం
పెర్త్: యాషెస్ సిరీస్ తొలి రోజునుంచే రసవత్తరంగా మొదలైంది. ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో భాగంగా ప్రారంభమైన తొలి టెస్ట్ తొలి రోజు బౌలర్ల అధిపత్యం చెలాయించారు. తొలుత ఇంగ్లండ్ 172 పరుగులకే పరిమితం కాగా.. అనంతరం ఆస్ట్రేలియా 123 పరుగులకే 9వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన బౌలింగ్‌తో ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంతితో విజృంభించిన అతడు దిగ్గజ కెప్టెన్లకు సాధ్యంకాని రికార్డు తన పేరిట రాసుకున్నాడు. ఈ మైలురాయికి చేరువైన ఇంగ్లండ్ రెండో కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు స్టోక్స్. అతడికంటే ముందు 1982లో అప్పటి కెప్టెన్ బాబ్ విల్లిస్ ఈ రికార్డు నెలకొల్పాడు. గబ్బా టెస్టులో విల్లిస్ ఐదు వికెట్లతో కంగరూలను కష్టాల్లోకి నెట్టాడు. యాషెస్ టెస్టు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో ఇంగ్లండ్ సారథిగా అవతరించాడు.
తొలి సెషన్ నుంచే ఉత్కంఠ రేపిన పెర్త్ టెస్టులో మొదటిరోజే 19 వికెట్లు పడ్డాయి. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హ్యారీ బ్రూక్(52) అర్ధసెంచరీకి తోడు పోప్(46), జేమీ స్మిత్(33), డకెట్(21) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మిచెల్ స్టార్క్ (7/58)కి తోడు డోగెట్‌కు రెండు, గ్రీన్‌కు ఒక వికెట్ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు మొదటి ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్ (2/11)షాకిచ్చాడు. మార్నస్ లబూషేన్(9)తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్ జేక్ వీథర్‌లాండ్(0)ను రెండో బంతికే ఎల్బీగా వెనక్కి పంపాడు. ఆ తర్వాత బ్రైడన్ కార్సే స్టీవ్ స్మిత్(17), ఖవాజా(2)లను ఔట్ చేయగా.. అక్కడి నుంచి బెన్ స్టోక్స్(5/23) జోరు చూపించాడు. మిడిలార్డర్ బ్యాటర్లైన ట్రావిస్ హెడ్(21), కామెరూన్ గ్రీన్(24), అలెక్స్ క్యారీ(26), మిచెల్ స్టార్క్(12), స్కాట్ బోలాండ్(0)లను ఔట్ చేసి ఐదో వికెట్లతో మెరిసాడు. ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సరికి 9 వికెట్లకు 123 పరుగులు చేసి ఇంకా 49 పరుగులు వెనకబడి ఉంది.



