తెలంగాణ షూటింగ్ పోటీలు
హైదరాబాద్ : 11వ తెలంగాణ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో లీషా కిరణ్ ఏడు స్వర్ణాలు సాధించింది. మహిళల 10మీ పిస్టల్ (సబ్ యూత్/యూత్/జూనియర్/ఉమెన్) విభాగాలు సహా 25మీ స్పోర్ట్స్ పిస్టల్ (యూత్/జూనియర్/ఉమెన్) విభాగాల్లో లీషా కిరణ్ పసిడి గురితో మెరిసింది. పురుషుల విభాగంలో సూర్య కృష్ణ ఐదు పతకాలు సాధించాడు. 25మీ పిస్టల్, స్పోర్ట్స్ పిస్టల్‌లో గోల్డ్ మెడల్ సహా 10మీ పిస్టల్ విభాగాల్లో రెండు రజతాలు, ఓ కాంస్యం గురి పెట్టాడు. పిస్టల్, స్పోర్ట్స్ పిస్టల్ విభాగాల విజేతలకు బుధవారం గచ్చిబౌలిలోని షూటింగ్ రేంజ్‌లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాట్జ్ చైర్మెన్ కే.శివసేన రెడ్డి, తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడు అమిత్ సంఘీ బహుమతులు ప్రదానం చేశారు.
లీషాకు ఏడు స్వర్ణాలు
- Advertisement -
- Advertisement -