నవతెలంగాణ జన్నారం: దండేపల్లి మండలంలోని తాళ్ల పేట ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు గురుకుల పరీక్షలు రాయగా మొదటి లిస్టులోనే 7 గురు విద్యార్థులు సీట్లు పొందారని ప్రధానోపాధ్యాయులు బాణావత్ ప్రభాకర్ తెలియజేశారు. సీట్లు సాధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కృషి వల్లనే 7గురు సీట్లు సాధించారని వారు తెలియజేశారు. నెన్నెల వేదాత్రి, బత్తిని అంజలి, కనాక శివాని, చిక్రం రవళిక, కోట రాజ్ కుమార్, బోయిని నాగచైతన్య, దుర్గం రోహన్ సీట్లు సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి. రామరాజు, పోలంపల్లి శ్రీనివాస్ మరియు మీనాక్షి మేడం పాల్గొన్నారు.
తిమ్మాపూర్ లో ముగ్గురికి గురుకులాల్లో సీట్లు
జన్నారం మండలంలోని తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల వెలువడిన గురుకుల ఫలితాల్లో ముగ్గురికి సీట్లు లభించాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు తెలిపారు. ఖంపెల్లి గంగోత్రి కి కడెంలో చందనగిరి యాద్విక్ కు చెన్నూరులో, యాద్విన్ కు ఉట్నూరు గురుకులాల్లో సీట్లు వచ్చాయన్నారు. సందర్భంగా విద్యార్థులను అభినందిస్తున్నామన్నారు.



