Monday, October 27, 2025
E-PAPER
Homeజాతీయంనేడు సుప్రీంకోర్టులో పలు కేసుల విచారణ

నేడు సుప్రీంకోర్టులో పలు కేసుల విచారణ

- Advertisement -

– ఉమర్‌ సహా పలువురి బెయిల్‌ పిటిషన్లు
న్యూఢిల్లీ :
2020 ఢిల్లీ అల్లర్ల కేసులో సామాజిక కార్యకర్తలు ఉమర్‌ ఖాలీద్‌, షార్జిల్‌ ఇమామ్‌, గుల్ఫిషా ఫాతిమా, మీరాన్‌ హైదర్‌ల బెయిల్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ ఎన్‌.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ లను విచారించే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 22న సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఉమర్‌ ఖాలీద్‌ సహా పలువురు సామాజిక కార్యకర్తలు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లపై స్పందించాలని పోలీసులను ఆదేశించింది. సామాజిక ప్రదర్శనలు, నిరసనల ముసుగులో కుట్రపూరిత హింసను అనుమ తించలేమని పేర్కొంటూ ఖాలీద్‌, ఇమామ్‌ సహా తొమ్మిది మందికి ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ కార్యకర ్తలు సెప్టెంబర్‌ 2న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఖాలీద్‌, ఇమామ్‌లతో పాటు ఫాతిమా, హైదర్‌, మొహమ్మద్‌ సలీమ్‌ఖాన్‌, షిఫా ఉర్‌ రెహమాన్‌, అథర్‌ ఖాన్‌, అబ్దుల్‌ ఖాలీద్‌ సైఫీ, షాదాబ్‌ అహ్మద్‌లు బెయిల్‌ తిరస్కరణను ఎదుర్కొన్నారు. మరో కార్యకర్త తస్లీమ్‌ అహ్మద్‌ బెయిల్‌ పిటిషన్‌ను సెప్టెంబర్‌ 2న మరో హైకోర్టు బెంచ్‌ తిరస్కరించింది. 2020 ఫిబ్రవరి 20న ఢిల్లీ అల్లర్ల కేసులో సూత్రధారులు అని ఆరోపిస్తూ ఖాలీద్‌, ఇమామ్‌ సహా పలువురు కార్యకర్తలపై ఉపా, గతంలోని ఐపీసీ నిబంధనల కింద కేసు నమోదు చేయబడింది. వీరంతా అప్పటి నుంచి జైలులోనే ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -