Monday, January 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపలువురు కలెక్టర్లకు ఓటర్‌ డే అవార్డులు

పలువురు కలెక్టర్లకు ఓటర్‌ డే అవార్డులు

- Advertisement -

– అందజేసిన రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని పలువురు కలెక్టర్లకు 16వ జాతీయ ఓటర్‌డే సందర్భంగా ప్రభుత్వం ఆవార్డులను ప్రకటించింది. ఆదివారం హైదారాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అవార్డులను అందజేశారు. కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతికి ఎన్నికల నిర్వహణ, రవాణా, జనగాం కలెక్టర్‌ రిజ్వాన్‌ భాషా షేక్‌కు శిక్షణ, వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారదకు ఓటర్ల అవగాహనకు గాను ఉత్తమ అవార్డులను అందుకున్నారు. సిద్దిపేట కలెక్టర్‌ కె.హైమావతి, యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ ఎం.హన్మంతరావు, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, నిజామాద్‌ కలెక్టర్‌ ఇలా త్రిపాఠికి బెస్ట్‌ ఎలక్ట్రోల్‌ ప్రాక్టీస్‌ అవార్డులు అందుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికలను పకడ్బందిగా నిర్వహించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ.కర్ణన్‌కు ప్రత్యేక అవార్డును అందజేశారు. ఎస్వోలు, డీపీవోలు, డిప్యూటీ తహసిల్దార్లు, బీఎల్‌వో తదితర కేడర్లకు చెందిన మరో 35 మంది ఓటర్‌డే అవార్డులు అందుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -