Monday, November 10, 2025
E-PAPER
Homeఖమ్మండ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురికి శిక్ష ఖరారు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురికి శిక్ష ఖరారు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ పలువురికి సోమవారం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దమ్మపేట కోర్ట్ న్యాయమూర్తి భవాని పలువురికి శిక్ష ఖరారు చేసినట్లు అశ్వారావుపేట ఎస్.హెచ్.ఓ ఎస్ఐ టి.యయాతి రాజు తెలిపారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన వారిలో  ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించి సత్తుపల్లి  సబ్ జైలుకి రిమాండు నిమిత్తం తరలించినట్లు తెలిపారు.మరో ఐదుగురు వ్యక్తులకు ఒక్క రోజు కమ్యూనిటీ సర్వీస్  తోపాటు ఒక్కొక్కరికి రూ.1000 లు జరిమానా విధించారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి డ్రైవింగ్ చేసేవారి పై కఠినమైన,చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -