పిల్లలను పౌష్టికాహార లోపం వెంటాడుతుంది
పౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ అంతర్జాతీయ సదస్సులో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రపంచంలోని పలు దేశాలతోపాటు ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు తీవ్ర ఆహార కొరత, భద్రత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం తిరువనంతపురం ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ (ఫాస్) నిర్వహిస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో వివిధ దేశాలకు చెందిన వక్తలు మాట్లాడారు. పలు ఆఫ్రికా దేశాల ప్రతినిధులు, వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు పలు పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు ఆఫ్రికా దేశాలు ఆహార ధాన్యాల దిగుమతులపై ఆధారపడటంతో ఆహార కొరత, పిల్లల పౌష్టికాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని నైజీరియా మంత్రి తెలిపారు. ఇక్రిశాట్ ప్రపంచ ప్రతినిధి మాట్లాడుతూ ఆహార ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాతావరణ, పర్యావరణ మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూలప్రభావాన్ని చూపిస్తున్నాయని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, స్వామినాథన్ సహచరులు జయరాజన్ పేర్కొన్నారు. చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
నీటి వసతి, సబ్సిడీలు, ఇతర సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ అనుబంధ వస్తువుల ధరలను అదుపు చేయడంతోపాటు పంటలకు సరైన ధరలు కల్పించాలన్నారు. పత్తి, కాఫీ, పౌల్ట్రీ, లైవ్‌స్టాక్, ఆయిల్ సీడ్స్, తృణధాన్యాలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రముఖ వ్యవసాయ నిపుణులు పార్వతీమీనన్ మాట్లాడుతూ తమిళనాడులో 1968లో కిల్వన్ మణిలో జరిగిన నిరుపేద వ్యవసాయ కార్మిక దళితులపై పెత్తదారుల ఊచకోత, షణ్ముగం వాచాతి గిరిజన మహిళలపై జరిగిన దారుణంగా లైంగికదాడులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వేతనాలు, వర్గ సమస్యలపై జరిగిన చర్చలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ప్రతినిధులుగా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి. సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ అరిబండి ప్రసాదరావు డిజిటలైజేషన్ ఫర్ ల్యాండ్ మెజర్‌మెంట్స్ అవకతవకలపై వారు పత్రాన్ని సమర్పించారు.
ఆఫ్రికా దేశాల్లో తీవ్ర ఆహార కొరత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



