హెచ్-1బీ వీసాల ఫీజు పెంపుతో నష్టమే : టెక్ పరిశ్రమ నాస్కామ్ ఆందోళన
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల రుసుంను లక్ష డాలర్ల (దాదాపు రూ.88లక్షలు)కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం భారత ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రంగంలో ఉద్యోగాలు పడిపోవడంతో పాటు ఐటి కంపెనీల లాభదాయకత దెబ్బతిననుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. యూఎస్ విధానాలు భారత ఐటీ కంపెనీల విదేశీ ప్రాజెక్టులకు అంతరాయం కలిగించనుందని తెలిపింది. వీసా ఫీజుల పెంపు 24 గంటల్లోనే అమల్లోకి వస్తుందని పేర్కొనడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటి వ్యాపార సంస్థలు, నిపుణుల్లో మరింత అనిశ్చితికి దారి తీసిందని తెలిపింది. ”హెచ్-1బీ వీసా ఫీజుల పెంపునకు సంబంధించిన వివరాలను విశ్లేషిస్తున్నాము. ఇది మోయలేని భారం. ఈ విధానం అమెరికా ఆవిష్కరణల వ్యవస్థతో పాటు ఉద్యోగాలపైనా తీవ్ర ప్రభావం చూపించనుంది. ఇది భారత కంపెనీల కోసం అమెరికాలో పని చేస్తున్న భారతీయులపైనా ప్రభావం చూపుతుంది.” అని నాస్కామ్ తెలిపింది.
ఇప్పటి వరకు హెచ్-1బీ వీసా ఫీజు రూ.2,000 డాలర్ల నుంచి రూ.5,000 డాలర్ల లోపు ఉంది. దీన్ని అమాంతం లక్ష డాలర్లకు పెంచడంతో ఐటీ కంపెనీల సహా అమెరికాలో ఉద్యోగం, వీసా హెచ్-1బీపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. ఈ వీసా కింద భారత్‌కు చెందిన అనేక కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయి. వేలాది మంది నిపుణులను అమెరికాకు పంపిస్తున్నాయి. అమెరికా ఇమిగ్రేషన్ విభాగం గణాంకాల ప్రకారం.. గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో హెచ్-1బీ వీసా ఆమోదం పొందిన వాటిల్లో అమెజాన్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్ అగ్రస్థానంలో ఉన్నాయి. హెచ్-1బి వీసాపై అమెజాన్‌లో 10,044 మంది, టిసిఎస్‌లో 5505 మంది, మైక్రోసాఫ్ట్‌లో 5189 మంది, మెటాలో 5123, ఆపిల్ 4202 మంది చొప్పున పని చేస్తోన్నారు. తర్వాత స్థానాల్లో గూగుల్ (4181), కాగ్నిజెంట్ (2493), జెపి మోర్గన్ చేజ్ (2440), వాల్‌మార్ట్ (2390), డెలాయిట్ కన్సల్టింగ్ (2353). ఇన్ఫోసిస్ (2004), హెచ్‌సీఎల్ అమెరికా (1728) టాప్‌లో 20 ఉన్నాయి.
భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం
- Advertisement -
- Advertisement -