ఫిర్యాదు చేసిన పట్టించుకోని కార్యదర్శ
నవతెలంగాణ – మిడ్జిల్
మండల కేంద్రంలోని ఆరవ వార్డులో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని మూడు నెలల క్రితం పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని బాధితుడు జనార్ధన్ తెలిపారు. ఆరవ వార్డులో తన ఇంటి నివాసం నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి కనెక్షన్ ఇవ్వకుండా ఇంటి ముందు ఉన్న అంజయ్య అడ్డుకుంటున్నట్లు తెలిపారు. డ్రైనేజి కనెక్షన్ లేకపోవడంతో ఇంటి ముందర నుండి రోడ్డుపై వరకు మురుగునీరు పారుతుండడంతో దుర్వాసన వెదజల్లుతూ దోమల ఎక్కువై కాలనీవాసులు రోగాల బాారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి మూడు నెలల క్రతమే ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని బుధవారం
తాసిల్దార్ యూపీ రాజ్, ఎంపీడీవో గీతాంజలి కి, మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ వరకు కనెక్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి సాయన్నను వివరణ కోరగా రేపటి వరకు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.