- Advertisement -
నవతెలంగాణ-అక్కన్నపేట
అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ జరుపుల సునీత రాజు నాయక్ దంపతులపై ఆ గ్రామానికి చెందిన కొంతమంది శనివారం దాడి చేశారు. గ్రామస్తులు, సర్పంచ్ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామపంచాయతీ స్థలం విషయంలో మాపై కక్ష కట్టి దాడి చేశారని అన్నారు. గ్రామపంచాయతీకి కేటాయించిన స్థలాన్ని ఆక్రమించాలని వారు చూశారని, దాన్ని అడ్డుకున్నందుకే నాపై, నా భర్త పై దాడికి దిగారని తెలిపారు. తండాలో నేను గెలిచినప్పటి నుంచి సూటిపోటి మాటలతో హింసిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన నాకు ప్రభుత్వం న్యాయం చేసి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని కోరారు. నాకు నా భర్తకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
- Advertisement -



