Monday, March 9, 2026
E-PAPER
Homeక్రైమ్లక్షల విలువైన నల్లా పైపులు గల్లంతు..

లక్షల విలువైన నల్లా పైపులు గల్లంతు..

- Advertisement -


నవతెలంగాణ – వర్ధన్నపేట
గ్రామాలలో తాగునీటి కోసం గత ప్రభుత్వంలో ఇంటింటికి మిషన్ భగీరథ వాటర్ సరఫరా కోసం అన్ని కొన్ని గ్రామాలలో నల్ల టాపులను ఏర్పాటు చేసింది. నిల్వ ఉన్న లక్షలు విలువచేసే నల్ల పైపులు ప్రస్తుతం గల్లంతయ్యాయి. అధికారులు సంవత్సరాల కొద్ది వారి పర్యవేక్షణ లేక పోవడంతో దొంగలు యధేచ్చగా దొంగిలించారు. మూడు రోజుల తర్వాత అధికారులు కళ్ళు తెరిచారు. గతంలో ఓ సామెత మాదిరిగా అధికారులు లేటుగా కళ్ళు తెరిచారు. ఇల్లంద గ్రామంలో 2,689 నల్ల కనెక్షన్ పైపులు, సుమారు రూ. 2 లక్షల పై చిలుకు విలువైన నల్ల టాపులు గల్లంతయ్యాయి. ఫిబ్రవరి 9వ తేదీ స్థానిక పోలీస్ స్టేషన్ లో మిషన్ భగీరథ అధికారి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు కొంతమందిని విచారిస్తున్నారు. నేటికీ పూర్తి వివరాలు మాత్రం రాకపోవడంతో నల్ల పైపుల దొంగలు ఎవరని వర్ధన్నపేట మండలంలో చర్చనీయాంశంగా  మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -