Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజషట్పది

షట్పది

- Advertisement -

ఉరుములు ఖణేల్మని కరిమబ్బుల్లో అరచినదానికన్నా
రైతుల మనోతటాకంలో ఒక చిన్న నీటితెడ సడిచేయడమే ఇష్టం నాకు-
మెరుపులు, నీలి ఆకాశంలో చరచరా రాజుకున్నదానికన్నా
రైతుల కనుకలువల మీద ఓ వెలుగురేఖ చమక్కుమనడమే ఇష్టం నాకు-
వాన, బడబాగ్నిలా బయట హోరెత్తి కురిసిందానికన్నా
రైతుల హదయకలశాలు శుభ్రజలంతో ప్రకాశించడమే ఇష్టం నాకు-
వరదలు, వాగుల గొంతులుకోస్తూ ఘోరంగా పారిందానికన్నా
రైతుల సంభాషణల్లో తూర్పుకు అరకలు సాగడమే ఇష్టం నాకు-
వర్ష ఋతువు, భూమి అందాల్ని బలత్కారంగా కంగాళీచేసిందానికన్నా
రైతుల అన్నం పళ్లేల్లో పిడికెడన్ని మెతుకులు రాల్చడమే ఇష్టం నాకు-
పిల్లలు, అస్తమానం ఆరిందాలై
అల్లర చిల్లరగా పార్కుల్లో ఆడిందానికన్నా
రైతులను పొలాల్లో కదిలించి మట్టికథలు
రాసుకురావడమే ఇష్టం నాకు.

డా.బెల్లి యాదయ్య, 9848382690

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad