నవతెలంగాణ – హైదరాబాద్: లైంగికదాడి కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఇరాన్ అధికారులు బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బుకాన్‌కు చెందిన ఒక బాలికపై లైంగికదాడికి పాల్పడి, ఆపై హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితుడికి బహిరంగంగా మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. మార్చిలో నిందితుడికి మరణశిక్ష ఖరారైంది. ఇది అత్యంత భావోద్వేగాలతో ముడిపడిన కేసు కావడంతో కఠిన శిక్ష విధించాలని నిర్ణయించినట్లు ఇరాన్ సుప్రీంకోర్టు తెలిపింది. అంతేకాకుండా బహిరంగ మరణశిక్షను సమర్థించింది. బాధిత కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు తాజాగా ఈ శిక్షను అమలు చేశారు. హత్య, లైంగికదాడి వంటి తీవ్రమైన కేసుల్లో ఇరాన్‌లో మరణశిక్షలు విధించడం సాధారణంగా జరుగుతుంది.
బాలికపై లైంగికదాడి.. బహిరంగ మరణశిక్ష అమలు
- Advertisement -
- Advertisement -