కామారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి
ఒకరిపై పోక్సో కేసు నమోదు
నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్
మాయమాటలు చెప్పి బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ భార్గవ్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌పై అదే గ్రామానికి చెందిన యువకుడు నాలుగు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు మెదక్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు బాలిక మూడు నెలల గర్భవతి అని తెలపడంతో
దిక్కుతోచని స్థితిలో నాగిరెడ్డిపేట్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. బాలికను సఖీ కేంద్రానికి తరలించారు.



