Sunday, October 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళపై లైంగికదాడి

మహిళపై లైంగికదాడి

- Advertisement -

ఆ తర్వాత చెట్టుకు కట్టేసిన దుండగులు
పరిశీలించిన డీఎస్పీ, సీఐలు

నవతెలంగాణ- కొల్చారం
గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళపై లైంగికదాడి చేసి చెట్టుకు కట్టేశారు. ఈ ఘటన శనివారం మెదక్‌ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి శివారులో వెలుగు చూసింది. గ్రామస్తులు, కొల్చారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ మండలం జానకంపల్లి పంచాయతీ పరిధిలోని ఓ తండాకు చెందిన మహిళపై దుండగులు లైంగికదాడికి ఒడిగట్టారు. ఆ తర్వాత పొతంశెట్టిపల్లి టీ జంక్షన్‌ నుంచి ఏడుపాయలకు వెళ్లే దారిలో ఖాళీ స్థలం వెనుక చెట్టుకు కట్టేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కొల్చారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధిత మహిళను మెదక్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌, రూరల్‌ సీఐ జార్జ్‌, కొల్చారం ఎస్‌ఐ మహ్మద్‌ మోహినుద్దీన్‌, పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌ సందర్శించారు. బాధితు రాలి ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -