నర్సింహుల పల్లి గ్రామంలో అలస్యంగా వెలుగులోకి
నవతెలంగాణ – బెజ్జంకి: పశువులపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగికదాడికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని నర్సింహుల పల్లి గ్రామంలో శనివారం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సింహుల పల్లి గ్రామానికి చెందిన జంగపల్లి శ్రావణ్ తన ఆవును ఏప్రిల్ 28న సాయంత్రం వ్యవసాయ పోలం వద్ద కట్టేసి ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం యథావిధిగా వ్యవసాయ పోలం వద్దకు పాలు పితకడానికి వెళ్లి ఆవును పరిశీలించగా.. లైంగికదాడికి గురైనట్టు గ్రహించాడు. మరికొద్ది దూరంలో జెట్టి శ్రీకాంత్ గేదే లైంగికదాడికి గురైనట్టు అనవాళ్లను కనిపెట్టారు. పశువులపై లైంగికదాడికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టామని ఏఎస్ఐ శంకర్ రావు తెలిపారు.
పశువులపై లైంగికదాడి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES