Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపైలట్‌ శిక్షణా విద్యార్థినిపై లైంగికదాడి

పైలట్‌ శిక్షణా విద్యార్థినిపై లైంగికదాడి

- Advertisement -

వెలుగులోకి ఇన్‌స్ట్రక్టర్‌ అరాచకం
హైదరాబాద్‌లోని బేగంపేట కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఘటన
నవతెలంగాణ-బేగంపేట్‌

హైదరాబాద్‌ బేగంపేటలోని ఓ పైలట్‌ శిక్షణా సంస్థలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థినిపై ఇన్‌స్ట్రక్టర్‌ లైంగికదాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట లోని ‘ఏవికన్స్‌ పైలట్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌’లో పైలట్‌ కోర్సు అభ్యసిస్తున్న యువతిపై అదే సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్న కేరళంకు చెందిన నసి ముద్దీన్‌ జనవరి 2025 నుంచి శిక్షణ ఇస్తానని నమ్మించి పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫొటోలు, వీడి యోలు తీసి బాధితురాలిని బ్లాక్‌మెయిల్‌ చేశాడు.

అతనికి మేడ్చల్‌ మల్కాజి గిరి జిల్లా దమ్మాయిగూడకు చెందిన మరో ఇన్‌స్ట్రక్టర్‌ సల్మాన్‌ సహకరిం చినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. బాధి తురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు లోకొచ్చింది. పోలీసులు వెంటనే స్పందించి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విద్యార్థినికి రక్షణ కల్పించాల్సిన స్థానంలో ఉన్న ఇన్‌స్ట్రక్టర్లు ఇలాంటి దారుణానికి పాల్పడటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు బేగంపేట పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -