Sunday, March 1, 2026
E-PAPER
Homeక్రైమ్గురుకుల విద్యార్థినిపై లైంగిక వేధింపులు

గురుకుల విద్యార్థినిపై లైంగిక వేధింపులు

- Advertisement -

– ఎలక్ట్రీషియన్‌ ఆగడాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని టీచర్లు
– ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన విద్యార్థిని
– విచారణ చేపట్టిన అధికారులు.. నిందితుడిపై కేసు
నవతెలంగాణ-మెండోర
నిజామాబాద్‌ జిల్లా మెండోర మండలం పోచంపాడ్‌ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మైనర్‌ బాలికను అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎలక్ట్రీషియన్‌ లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. గతంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన ఘటన భయాందోళనకు గురిచేయగా.. తాజాగా ఓ బాలిక తానూ చనిపోతానంటూ తల్లిదండ్రులకు లేఖ రాసింది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పాఠశాలలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే ఓ వ్యక్తి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక, హాస్టల్‌లో వారు బాత్‌రూమ్‌కు వెళ్లే సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు వెలుగులోకొచ్చింది. ఈ విషయం తన తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలియజేసిన బాలిక.. ప్రతినిత్యం నరకయాతన అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని బాధితురాలి తల్లిదండ్రులు తరగతి టీచర్‌కు తెలియజేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో లైంగిక వేధింపులు పెరగడమేకాకుండా బాధితురాలిని భయాందోళనకు కూడా గురిచేస్తున్నట్టు తెలిసింది.

వివరాల్లోకెళ్తే.. పదిరోజుల క్రితం పదో తరగతి బాలిక స్నానానికి వెళ్లిన సమయంలో ఎలక్ట్రీషియన్‌ ఆమెను వెంబడించాడు. లైట్లు ఆన్‌ ఆఫ్‌ చెక్‌ చేయాలనే పేరుతో బాలికను పిలిచాడు. ఆమెపై రెండు చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన సమయంలో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దాంతో వారు టీచర్‌కు తెలియజేశారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని, ఎవరికీ చెప్పొద్దని సదరు టీచర్‌ చెప్పినట్టు తల్లిదండ్రులు తెలిపారు. అయినప్పటికీ ఆ హాస్టల్‌లో ఉండలేనంటూ బాధితురాలు ఏడ్చినా.. పదో తరగతి పరీక్షలున్నాయని తల్లిదండ్రులు సర్దిచెప్పారు. ఆ తర్వాత నిందితుడు బాలికను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. దాంతో ఆ అమ్మాయి ‘తాను భవనంపై నుంచి దూకి చనిపోతా’నంటూ తల్లిదండ్రులకు లేఖ రాయడంతో హుటాహుటిన వారు హాస్టల్‌కు చేరుకున్నారు. టీచర్లను సంప్రదించినప్పటికీ ‘విషయం బయటకు చెప్పకండి.. సమస్యను పరిష్కరిస్తాం. అతన్ని మందలిస్తాం’ అంటూ దాటవేశారు. బాధితురాలి తండ్రి స్థానిక సర్పంచ్‌ కావడంతో అధికారులకు విషయం తెలియజేశాడు. హాస్టల్‌లో ఎలక్ట్ట్రీషియన్‌గా పనిచేసే నిందితుడి చర్యలకు విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో విద్యార్థులు హాస్టల్‌లో ఉండేందుకు ససేమీరా అంటున్నట్టు సమాచారం. ఈ ఘటనపై టీచర్లు కూడా వెంటనే స్పందించడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు గురుకుల పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. స్థానిక ఎస్‌ఐ సుహాసిని నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -