Tuesday, February 17, 2026
E-PAPER
Homeసినిమాపవర్‌ఫుల్‌ కథతో 'సెయాన్‌'

పవర్‌ఫుల్‌ కథతో ‘సెయాన్‌’

- Advertisement -

శివ కార్తికేయన్‌, దర్శకుడు శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ నిర్మిస్తున్న కొత్త చిత్రం కోసం చేతులు కలిపారు. బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన ‘అమరన్‌’ తర్వాత శివకార్తికేయన్‌ మరోసారి రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌తో కొలాబరేట్‌ కావడం విశేషం. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌ విజయాన్ని అందుకున్న ఆ చిత్రంతో ఏర్పడిన క్రియేటివ్‌ జర్నీ ఇప్పుడు మరింత బలపడింది. గ్రాండ్‌ రూరల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సెయాన్‌’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. 2026లో బిగ్గెస్ట్‌ ఫ్యామిలీ స్పెక్టకిల్‌గా నిలిచేలా ఎమోషన్స్‌, మాస్‌ ఎలిమెంట్స్‌, వినోదాన్ని మేళవిస్తూ ఈ సినిమా రూపొందుతోంది.

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో శివకార్తికేయన్‌ డివైన్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్‌ అందర్నీ అలరించడమే కాకుండా సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, శివకార్తికేయన్‌, సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ కలిసి పనిచేస్తున్న తొలి సినిమా కావడం కూడా ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేకతగా నిలిచింది.
రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ లెగసీ, టర్మరిక్‌ మీడియా విజన్‌ కలిసిన ఈ సినిమా ఈ ఏడాదిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటిగా నిలవనుంది. నటీనటులు, సాంకేతిక బృందం, రిలీజ్‌ వివరాలపై మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలో మేకర్స్‌ తెలియజేయనున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: కమల్‌ హాసన్‌ – ఆర్‌. మహేంద్రన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -