నవతెలంగాణ – జుక్కల్
బాన్సువాడ డివిజన్ కేంద్రం లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రయివేటు, కార్పోరేట్ విద్యా సంస్థల బంద్ విజయవంతంగా జరిగిందని ఎస్ఎఫ్ఐ జుక్కల్ మండలాధ్యక్షుడు షేక్ పీర్దోస్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ చేస్తున్న డిమాండ్స్ ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్స్, ఎంఈఓ , డీఈవో, పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి, పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ విద్య సంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ చార్జీలు, అదేవిధంగా మెస్ కాస్మోటిక్ చార్జీలను పెంచాలని కోరారు.
అద్దె భవనాలు నడుస్తున్న వసతి గృహాలకు, గురుకుల పాఠశాలలో నూతన భవనం ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. నూతన విద్యా విధానం 2020 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని తెలిపారు. అనేక విద్యార్థి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరించాల్సిందిగా భారత విద్యార్థి ఫెడరేషన్ – ( ఎస్ ఎఫ్ ఐ ) డిమాండ్ చేస్తున్నామని, అందుకుగాను విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల టీచర్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్స్ ప్రైవేటు కార్పొరేటు యాజమాన్యాలకు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి విప్లవ వందనాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి సంఘ నాయకులు షేక్ షాదుల్ , షేక్ జబీర్, మొహ్మద్, ఇస్మాయిల్, షేక్ ఇస్మాయిల్, అసాద్ అమీర్ పఠాన్, ఆశం, నవీన్,బాను ప్రసాద్,ఈశ్వర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .