Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కై తలపెట్టిన ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం

స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కై తలపెట్టిన ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం

- Advertisement -

నవతెలంగాణ  – ఆర్మూర్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజాంబాద్ జిల్లాలో పెండింగ్  స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని గురువారం  క్షత్రియ కళాశాల ను బంద్ సంపూర్ణంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ  జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి 8100 కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా దీపావళి లోపు రూ.600 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయకపోవడం దారుణమని ఆయన అన్నారు.

ఒకపక్క స్కాలర్షిప్ లో ఫీజు రీయింబర్స్మెంట్ లు రాక విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం యాజమాన్యాలను సంప్రదిస్తే ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి యాజమాన్యాలు చెప్పడంతో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను విద్యార్థుల చదువుల కోసం అప్పుచేసి యాజమాన్యాలకు ఫీజులు కడుతున్న పరిస్థితి ఈ జిల్లాలో దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని యాజమాన్యాలు ప్రశ్నిస్తే విజిలెన్స్ దాడులు జరుపుతున్నారని అన్నారు. వెంటనే విద్యార్థుల హక్కు అయినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చేయకపోతే తీవ్ర ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షులు జీషణ్, నాగేంద్ర, నిరంజన్, శ్రీనివాస్, తదితరులు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -