ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు
భువనగిరిలో ఎస్ఎఫ్ఐ ప్రారంభ సభల ర్యాలీ
నవతెలంగాణ – భువనగిరి: స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతో అధ్యయనం పోరాటం నినాదంతో ఎస్ఎఫ్ఐ ఏర్పడిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి మూడు రోజుల రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులతో ప్లకార్డులు జండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1970లో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ నాటి నుంచి నేటి వరకు విద్యారంగ పరిరక్షణ కోసం, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల కోసం నికరంగా పోరాడుతున్న సంఘముగా దేశంలో గుర్తింపు పొందిందన్నారు. భగత్ సింగ్ , రాజ్ గురు, సావిత్రిబాయి పూలే, చేగువేరా అంబేద్కర్ మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నామన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చినటువంటి బిజెపి ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకొచ్చి విద్యను పూర్తిగా కాషాయకరణ ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజాపాల పేరుతో అధికారులను వచ్చి 20 నెలలు గడుస్తున్న విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం పూర్తిగా విఫలమైందన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో కాలయాపన చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక విద్య పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం జరుగుతా ఉన్నదన్నారు. ఈ తరుణంలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకత్వానికి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ తరగతులో పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు విద్యార్థి ఉద్యమ నిర్వహించడం కోసం శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు. శిక్షణ తరగతుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై విద్యారంగా సమస్యల పరిష్కరించల కోసం ఒక భవిష్యత్తు కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు,ఈర్ల రాహుల్, జిల్లా కమిటీ సభ్యులు నేహల్, జగన్, ఉదయ్, నరేందర్, పట్టణ నాయకుడు మహేష్, సతీష్, కీర్తన, ఉమ,మౌనిక పాల్గొన్నారు..