Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్SFI: విద్యాసంస్థల బంద్ విజయవంతం: మాగాణి ప్రశాంత్

SFI: విద్యాసంస్థల బంద్ విజయవంతం: మాగాణి ప్రశాంత్

- Advertisement -

నవతెలంగాణ-ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల పరిధిలోని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మండల కమిటీ  ఆధ్వర్యంలో బుధవారం మండలంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరిగిందని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి మగాని ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా బంద్ ను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ మండల నేత చింతల నాగరాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి నియమించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్, ఎం ఈ ఓ, డి ఇ ఓ పోస్టులు భర్తీ చేయాలి. ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి, నిధులు ఇవ్వాలి. అన్ని స్కూళ్లలో పి ఈ టీ పోస్టులు భర్తీ చేయాలి. స్వీపర్, అటెండర్ పోస్టులను భర్తీ చేయాలి. విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ ఇవ్వాలి. హాస్టల్ విద్యార్థులకు పెండింగ్ కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలి. అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలి. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి.

ఎయిడెడ్ పాఠశాలలకు పెండింగ్ నిధులు ఇవ్వాలి. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి. గురుకులాల్లో ఆ శాస్త్రీయంగా తీసుకువచ్చిన సమయపాలనను మార్చాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. ఏన్ ఈ పి .2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అనంతరం ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తాహసిల్దార్ ప్రమీలకు విద్యారంగ సమస్యలపై డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకాష్, గణేష్, శివ, భవాని, రమ్య, అక్షిత, మధుప్రియ, కీర్తి, సింధు, కీర్తన అర్చన, అనిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -