Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల సమస్యల పట్ల ఎస్ఎఫ్ఐ అలుపెరుగని పోరాటం చేస్తుంది

విద్యార్థుల సమస్యల పట్ల ఎస్ఎఫ్ఐ అలుపెరుగని పోరాటం చేస్తుంది

- Advertisement -

రేపు జరగనున్న జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయండి
డివిజన్ గర్ల్స్ కమిటీ కన్వీనర్ వైష్ణవి
నవతెలంగాణ – అచ్చంపేట
విద్యార్థుల సమస్యల పట్ల ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని డివిజన్ గర్ల్స్ కమిటీ కన్వీనర్ వైష్ణవి అన్నారు. శుక్రవారం అచ్చంపేటలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రేపు అచ్చంపేటలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ గర్ల్స్ రాష్ట్ర నాయకురాలు పాల్గొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్, డివిజన్ గర్ల్స్ కమిటీ సభ్యులు శ్రావణి, జమీల, ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ మెంబర్స్, పరమేష్, సంతోష్, రామ్ చరణ్, పృధ్వీరాజ్, వెంకటేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -