నవతెలంగాణ -పరకాల
పరకాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ గౌస్ పదవి విరమణ పొందుతున్న సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించడం కోసం మహమ్మద్ గౌస్ కృషి ఎనలేనిదన్నారు. సొంత ఖర్చులతో దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు ఆటోలను ఏర్పర్చారన్నారు. దాంతో చుట్టుపక్కల గ్రామాల పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఆటోల ద్వారా పరకాల పట్టణానికి వచ్చి విద్యభ్యాసం చేసేవారన్నారు. ఆయన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులెందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, నాయకులు మహేష్, విజయ్, సందీప్ పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయుడిని సన్మానించిన ఎస్ఎఫ్ఐ నేతలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES