Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముగిసిన ఎస్జిఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్ 17 క్రీడలు

ముగిసిన ఎస్జిఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్ 17 క్రీడలు

- Advertisement -

క్రీడలకు అడ్డాగా మారిన నెల్లికుదురు మండలం 
క్రీడల కన్వీనర్ పిఈటి ఐలయ్య 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండల కేంద్రంలో ఎస్ సి జి ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్ 17 అండ్ 14 ఇయర్స్ బాలబాలికల క్రీడలు ప్రారంభమై ముగిసాయి అని ఎంఈఓ రామదాసు క్రీడల కన్వీనర్ ఐలయ్య తెలిపారు. ఆదివారం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 69వ ఎస్ జి ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్ 17 & 14 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్  నెట్ బాల్ 17 ఇయర్స్ 14 ఇయర్స్ సెపక్తక్రా , 17 ఇయర గట్కా, 17 ఇయర్స్ 14 ఇయర్స్ బాల బాలికల తంగ్  త మార్షల్ ఆర్ట్స్ , అలాగే 17 & 14 ఫెన్సింగ్ విజయవంతంగా ముగిశాయి అని తెలిపారు.

ఈ క్రీడలకు ఉమ్మడి ఆరు జిల్లాల నుండి 400 మంది క్రీడాకారులు పైగా పాల్గొన్నారు. అందులో జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. మండల కేంద్రంలో పీఈటి ఐలయ్య ఆధ్వర్యంలో ఎన్నో రకాల క్రీడలను నిర్వహించి క్రీడాకారులకు కావాల్సిన మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేసి ఎంతోమందిని తీర్చిదిద్దిన ఘనత ఆయనకు దక్కింది అని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా క్రీడాకారులకు చేయూతనిచ్చి తీర్చిదిద్దామని తెలిపారు .క్రీడలకు హబ్బుగా నెల్లికుదురు మండల కేంద్రం పి ఈ టి ఐలయ్య ఆధ్వర్యంలో ఏర్పడుతుందని దీనికి కృషి చేస్తున్న పీఈటి ఐలయ్యను అభినందించినట్లు తలిపారు .ఈ కార్యక్రమంలో క్రీడల కన్వీనర్ ఐలయ్య  సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్  జోనల్ సెక్రటరీ మహమ్మద్ ఇమామ్ మహబూబాబాద్ జోన్ సెక్రటరీ శ్రీనివాస్  ఫిజికల్ డైరెక్టర్లు శంకర్ విజయ్ చందర్ సునీత ప్రణయ్ వరప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -