Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ ప్రచారంలో పాల్గొన్న షబ్బీర్ అలీ 

మున్సిపల్ ప్రచారంలో పాల్గొన్న షబ్బీర్ అలీ 

- Advertisement -

– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి 
నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కాంగ్రెస్  షబ్బీర్ అలీ 3, 4, 5, 8, 26, 29, 30, 31 వార్డుల్లో పర్యటించారు. ఆయన పర్యటనకు ప్రజలు భారీగా హాజరై బ్రహ్మరథం పట్టగా, మహిళలు హారతులతో, యువత గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ అభివృద్ధి చేసి చూపిస్తున్నామని, అదే ఆధారంగా ఓట్లు అడుగుతున్నామని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరింత అభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికల తర్వాత ప్రజలకు దూరమైన నాయకులకు ఈసారి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కుల, మతాల పేరుతో ప్రజలను విభజించే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మానవత్వమే తమ మతమని, కామారెడ్డిని రాష్ట్రంలో రోల్ మోడల్ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. ప్రతి వార్డుకు డ్రైనేజీలు, వీధి దీపాలు, మౌలిక వసతులపై స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు.

అభ్యర్థులను గెలిపిస్తే నిధులు తీసుకురావడం నుంచి పనుల పర్యవేక్షణ వరకు తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -