- Advertisement -
నవతెలంగాణ- కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వివిధ కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుజాల్పూర్ రాంచంద్ర రెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన డాక్టర్ నాగిరెడ్డి కుటుంబ సభ్యులను వారి నివాసంలో కలసి ఓదార్పు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



