పౌల్ట్రీ రైతుల ఆస్తి పన్ను బకాయిల రద్దు పట్ల హర్షం..
సీఎంకు సత్కారం..
నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్
షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని పౌల్ట్రీ రైతులు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి సత్కరించారు. ఇటీవల పౌల్ట్రీ రైతుల ఆస్తి పన్ను బకాయిలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ను తీసుకురావటం పై షాద్ నగర్ పౌల్ట్రీ రైతులు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట నాయకులు పాతూరి వెంకటరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ శాసనసభ్యులు, పీఏసీ ఛైర్మన్ అరెక పూడి గాంధీ, ప్రభుత్వ సలహాదారుడు వేంనరేందర్ రెడ్డితో కలిసి పౌల్ట్రీ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. చటాన్ పల్లిలో రెండు వందలకు పైగా కుటుంబాలు 40 ఏండ్ల క్రితం పౌల్ట్రీ ఫారాలను నెలకొల్పుకుని ఉపాధి పొందుతున్నారు. అయితే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం షాద్ నగర్ ను మున్సిపాలిటీ గా మార్చడంతో చటాన్ పల్లి గ్రామాన్ని మున్సిపాలిటీ లో విలీనం చేయగా మున్సిపాలిటీకి ఆస్తి పన్ను కట్టాలని పౌల్ట్రీ రైతులకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో సమస్య తలెత్తింది.
నాటి నుంచి సుమారు 15 ఏండ్లుగా పన్నులను రద్దు చేయాలని కోరుతూ పౌల్ట్రీ రైతులు గత ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పీఏసీ ఛైర్మన్ ఆరేకపూడి గాందీ ముఖ్య మంత్రి ప్రధాన సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శంకరయ్య సహకారంతో మానవతా దృక్పథంతో రైతుల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి, రైతులపై ఉన్న ఆస్తి పన్ను బకాయిలను రద్దు చేస్తూ జీవో తీసుకురావడం పట్ల పౌల్ట్రీ రైతుల రాష్ట్ర నాయకులు పాతూరి వెంకట్రావు సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వేంనరేందర్ రెడ్డి కి, పిఏసి చైర్మన్ అరెకపూడి గాంధీకి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, స్థానిక ఎంఎల్ఏ శంకరయ్యకు పౌల్ట్రీ రైతుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ రైతులు గుదే వసంతరావు, మక్కాపాటి మల్లేశ్వర రావు, కొర్రపాటి శ్రీనివాస రావు, మలినేని సాంబశివ రావు, కొడాలి సురేష్, మలినేని శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షాద్ నగర్ పౌల్ట్రీ రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



