Monday, February 23, 2026
E-PAPER
Homeజాతీయంశరద్‌ పవార్‌కు అస్వస్థత

శరద్‌ పవార్‌కు అస్వస్థత

- Advertisement -

ఆస్పత్రిలో చేరిక

ముంబయి : నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ-ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ అస్వస్థత కు గురయ్యారు. ఆయనను పుణెలోని రుబీ హాల్‌ ఆస్పత్రికి తరలించినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడి ంచాయి. తీవ్రమైన దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్‌తో ఇటీవల ఆస్పత్రిలో చేరిన శరద్‌ పవార్‌ను వారం క్రితం తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఆస్పత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. ఆయన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శరద్‌ పవార్‌ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని రోజులుగా పవార్‌ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -