Wednesday, October 1, 2025
E-PAPER
Homeసినిమాచిత్ర నిర్మాణంలోకి శర్వానంద్‌

చిత్ర నిర్మాణంలోకి శర్వానంద్‌

- Advertisement -

హీరో శర్వానంద్‌ తన క్రియేటివ్‌ ప్రయాణంలో మరో ముందడుగు వేసి, కొత్త బ్రాండ్‌ ‘ఓంఐ’ని ఆవిష్క రించారు. మాజీ భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సమక్షంలో దీన్ని లాంచ్‌ చేశారు.
శర్వానంద్‌ మాట్లాడుతూ,’ ఇది ఒక బ్రాండ్‌ ఆవిష్కరణ మాత్రమే కాదు. రాబోయే తరాలకు చేరుకునే ఒక విజన్‌. ఈ జర్నీని ఒంటరిగా మొదలుపెడుతున్నా, కానీ సత్యం, స్పష్టత, నిజాయితీతో ముందుకు సాగుతాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు, క్రియేటివ్‌ మైండ్స్‌ని ఒకే వేదికపైకి తెచ్చి, వారికి గొంతుకనివ్వాలనుకుంటున్నా. సత్యం, సమన్వయం, మానవ అనుబంధాన్ని ప్రతిబింబించే కథలు చెప్పబోతున్నాం. ప్రతి క్రియేటర్‌కు ప్రేరణనిచ్చే, మద్దతు లభించే, విలువ కలిగిన ఇల్లుగా మా సంస్థ నిలవాలని నా కోరిక. సినిమాలు, ప్రొడక్షన్స్‌ మాత్రమే కాకుండా ఆరోగ్యం, జీవనం, నిలకడైన అభివద్ధి వైపు కూడా మా సంస్థ దష్టి సారిస్తుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -