- Advertisement -
న్యూఢిల్లీ : దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ తన ఇండియా ఎండీ, సీఈఓగా శాశ్వత్ శర్మను నియమించింది. భారతీ ఎయిర్‌టెల్ గురువారం తన సీనియర్ నాయకత్వంలో వరుస మార్పులను ప్రకటించింది. శాశ్వత్ నియామకం 2026 జనవరి 1 నుండి అమల్లోకి రానుంది. వాటాదారుల ఆమోదానికి లోబడి ఐదేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆ సంస్థ ప్రస్తుత వైస్ చైర్మెన్, ఎండీగా ఉన్న గోపాల్ విట్టల్‌ను ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మెన్‌గా నియమిస్తూ ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
- Advertisement -



