నవతెలంగాణ – హైదరాబాద్
వ్యవసాయ యంత్రాల తయా రీలో అగ్రగామి సంస్థ ఎస్కార్ట్స్ కుబోటా దక్షిణాది రాష్ట్రాల్లో వరి సాగు అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన శౌర్య ట్రాక్టర్ సిరీస్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరిం చింది. తన వ్యాపారాన్ని దేశవ్యాప్తం గా విస్తరించే వ్యూహంలో భాగంగా ఈ సిరీస్‌ను విడుదల చేశామని ఆ సంస్థ సిఎండి నిఖిల్ నందా తెలిపారు. ఉత్తరాదిలోని 23 శాతం కంటే దక్షిణాది మార్కెట్లలో ట్రాక్టర్ల వృద్ధి రేటు 26 శాతంతో అధికంగా ఉందన్నారు. అందుకే తమ తదు పరి విస్తరణ, వృద్ధికి దక్షిణ భారత్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. దీని ఎక్స్‌షోరూం ధరను రూ.5.75 లక్షల నుండి రూ.7.30 లక్షల వరకు నిర్ణయించామన్నారు. ఈ సిరీస్‌లో 39హెచ్‌పి నుంచి 52 హెచ్‌పి సామర్థ్యంతో 5 వేర్వేరు రకాల్లో ఈ ట్రాక్టర్లు అందుబాటు లోకి వచ్చాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్నాటకలోని 40 మిలియన్ హెక్టార్ల వరి సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని, బురద పొలాల్లో కూడా సమర్థవం తంగా పనిచేసేలా వీటిని రూపొం దించామని ఆయన తెలిపారు. రాబోయే ఐదేండ్లలో ఏటా 8 నుంచి 10 కొత్త ఉత్పత్తులను విడుదల చేయడమే తమ లక్ష్యమని నిఖిల్ నందా వెల్లడించారు. క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగానే ఈ సిరీస్‌ను అభివృద్ధి చేశామని డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అకిరా కాటూ తెలిపారు. రైతుల పని అవసరాలకు సరిగ్గా సరిపోతాయని వివరించారు.
ఎస్కార్ట్స్ కుబొటా నుంచి శౌర్య ట్రాక్టర్ సిరీస్
- Advertisement -
- Advertisement -



