నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
యాదవ సోదరుల గొర్రెల దొంగతనాలను అరికట్టాలని యాదాద్రిభువనగిరి జిల్లా జీఎంపీస్ గౌరవ అధ్యక్షులు బండారు నరసింహ అన్నారు. గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిఎంపిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం చౌటుప్పల్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం యాదాద్రిభువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నరసింహ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో గొర్రెల దొంగతనాలు ఎక్కువ అయ్యాయని అన్నారు. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల పరిధిలో భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామానికి చెందిన మేడబోయిన కొమరయ్య గొర్రెల మందలో దొంగలు పడి 100 గొర్రెలను ఎత్తుకెళ్లారని అన్నారు. తక్షణమే పోలీస్ అధికారులు స్పందించి గొర్రెల దొంగలను పట్టుకొని శిక్షించాలని కోరారు.
కొమరయ్య కుటుంబాని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా యాదాద్రిభువనగిరి జిల్లాలో భువనగిరి బీబీనగర్ మండలాలలో విపరీతమైన గొర్రెల దొంగతనాలు జరుగుతున్నాయని నరసింహ వాపోయారు. గతంలో అనేక సందర్భాల్లో పోలీస్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన తాత్కాలికంగా కొంత మందిని పట్టుకొని వదిలేస్తున్నారని నరసింహ అన్నారు. తక్షణమే దొంగతనం చేసిన వారిని కఠినంగా శిక్షించి మళ్లీ దొంగతనాలు జరగకుండా చూడాలని, గొర్రెల యజమాలను కాపాడాలని తెలిపారు. పోలీసు అధికారులు ప్రత్యేకమైన మొబైల్ ను ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం మండల కార్యదర్శి కొండే శ్రీశైలం అధ్యక్షులు భీమనగొని బాలరాజ్ జిల్లా కమిటీ సభ్యులు గుణమోని ఐలయ్య గజ్జి పాండు గడగోటి జంగయ్య అరిగే బీరయ్య శంకరయ్య యాదయ్య తదితరులు పాల్గొన్నారు.



