– బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి..
– జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : గొర్రెల దొంగలను వెంటనే గుర్తించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జిఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రానికి సూచించారు. మంగళవారం భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో మేడబోయిన బాలయ్యకు సంబంధించిన సుమారు 100 గొర్రెలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించగా, బాధిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ విషయంపై పోలీస్ యంత్రాంగానికి సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా జిల్లావ్యాప్తంగా గొర్రెల దొంగతనాల వలన గొర్రెల కాపరులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విచారణ వేగవంతం చేసి , సిసి ఫుటేజ్ ఆధారంగా గొర్రెల దొంగలను గుర్తించాలని కోరారు.
గొర్రెల దొంగలను వెంటనే పట్టుకోవాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



