నవతెలంగాణ – హైదరాబాద్: ‘ ఆస్పైర్ ఫర్ హర్’ తమ ప్రతిష్టాత్మక ‘ షీఎక్స్‌పోర్ట్స్’ కార్యక్రమాన్ని తెలంగాణ యొక్క ప్రధాన ఆవిష్కరణ కేంద్రమైన వీహబ్‌లో విజయవంతంగా నిర్వహించడంతో మహిళల ఆర్థిక సాధికారతకు తాజా కేంద్రంగా హైదరాబాద్ నగరం నిలిచింది. ఇప్పటికే ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పూణే, అహ్మదాబాద్ మరియు చండీగఢ్‌లలో వందలాది మంది మహిళా వ్యవస్థాపకులను శక్తివంతం చేసే రీతిలో ప్రభావవంతమైన కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత, ఏడవ విజయవంతమైన కార్యక్రమంగా ఇది నిలిచింది.
సీడ్ (SEED) తో వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉండటంతో పాటుగా బహుళ-కరెన్సీ ఖాతాలు మరియు సరిహద్దుల వెలుపల చెల్లింపు పరిష్కారాలను అందించే గ్లోబల్ పేమెంట్స్ లీడర్ పయోనీర్ మద్దతు ఉండటం చేత, మహిళా వ్యవస్థాపకులు తమ వ్యాపారాలను దేశీయ సరిహద్దులకు మించి తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. హాజరైన వారికి ప్రపంచవ్యాప్తంగా తమ కార్యక్రమాలను విస్తరించటానికి అవసరమైన జ్ఞానం , నెట్‌వర్క్‌లను ఈ కార్యక్రమం అందించింది.
ప్రపంచవ్యాప్తంగా వెళ్లడానికి , నిధులు పొందడానికి నిజంగా ఏమి అవసరమో అర్థం చేసుకోవడానికి అరవై మందికి పైగా ఉత్సాహవంతులైన మహిళా వ్యవస్థాపకులు సమావేశమయ్యారు. ” ఫండింగ్ అండ్ స్కేలింగ్ గ్లోబల్లీ ?” అనే ఆకర్షణీయమైన నేపథ్యం కింద జరిగిన ఈ కార్యక్రమం, భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యాపార నాయకులను, స్ఫూర్తిదాయక వ్యవస్థాపకులను ఒకచోట చేర్చి, అంతర్జాతీయ క్లయింట్‌లను సంపాదించడం, ఎగుమతికి సిద్ధంగా ఉన్న నమూనాలను రూపొందించడం , పెట్టుబడిదారులు అవును అని చెప్పే భాషను మాట్లాడేలా వ్యాపారాలను నిర్మించడంపై వాస్తవ ప్రపంచ పరిజ్ఞానంను నెట్‌వర్క్ చేయడానికి మరియు మార్పిడి చేసుకోవడానికి తీసుకువచ్చింది.
ఈ సాయంత్రం ముఖ్యాంశం, ఈ క్రింది వాటిని కలిగి ఉన్న నిష్కపటమైన మరియు పరిజ్ఞానంతో కూడిన ప్యానెల్ చర్చ:
· అబైరో క్యాపిటల్‌లో భాగస్వామి అయిన మాన్సి సేత్, ముఖ్యంగా సాస్ (SaaS) మరియు ఏఐ -ఆధారిత వెంచర్‌ల కోసం గ్లోబల్ వెంచర్ క్యాపిటల్‌ను పొందడంలో సూక్ష్మ నైపుణ్యాలను వివరించారు.
· బయోమ్ వ్యవస్థాపక సభ్యుడు & విపి జరాన్ భగవాగర్ , వ్యాప్తి చేయతగిన వృద్ధి వెనుక కార్యాచరణ అంశాలను తెలిపారు.
· న్యూమెన్ లా ఆఫీస్‌లో భాగస్వామి అయిన మానసి చౌదరి, సరిహద్దు నిధుల సేకరణ మరియు అంతర్జాతీయ మార్కెట్ ప్రవేశానికి కీలకమైన చట్టపరమైన కార్యాచరణ అంశాలను గురించి వెల్లడించారు.
100 గిగా వ్యవస్థాపకురాలు ప్రియాంక కామత్ మోడరేట్ చేసిన ఈ చర్చా కార్యక్రమంలో, ఏఐ యుగం కోసం సాస్ మోడళ్లను స్థానికీకరించడం, ఎగుమతి చేయగల ఏఐ వినియోగ కేసులను గుర్తించడం, సేవా ఆధారిత వ్యాపారాలను వ్యాప్తి చేయడం మరియు భారతదేశం నుండి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే కంపెనీలను నిర్మించడం వంటి అంశాలను చర్చించారు. తమ లక్ష్యంలో స్పష్టత నుండి నియంత్రణ సంసిద్ధత, ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించే కథ చెప్పడం వరకు పెట్టుబడిదారుడు “అవును” అని చెప్పడానికి ఏమి అవసరమో కూడా ఈ కార్యక్రమంలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో అబైరో క్యాపిటల్‌కు చెందిన మాన్సి సేత్ మాట్లాడుతూ, “అబైరో వద్ద , మేము బలమైన వ్యాపారాల కోసం మాత్రమే చూడము, ముందుచూపు, పట్టుదల, తమ మార్కెట్ గురించి అచంచలమైన అవగాహన కలిగిన వ్యవస్థాపకుల కోసం చూస్తాము. షీఎక్స్‌పోర్ట్స్ వద్ద ఆ స్వరాలు, ముఖ్యంగా మహిళలు నడిపించేవి, కేవలం మాట్లాడవు, అవి నడిపిస్తాయి. ఇది కేవలం మూలధనం గురించి కాదు. ఇది మనమందరం నిర్మిస్తున్న భవిష్యత్తును సమర్థించడం గురించి.. ” అని అన్నారు.
భారతదేశ వ్యాప్తంగా మహిళా వ్యవస్థాపకులు అంతర్జాతీయ మార్కెట్లను ఎక్కువగా చూస్తున్నందున, ఈ కార్యక్రమం బలమైన సందేశాన్ని పంపింది: సరైన మూలధనం, తగిన రీతిలో సూచనలు మరియు సమాజంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడం సాధ్యం మాత్రమే కాదు, అది అందుబాటులో ఉంటుంది.
“షీఎక్స్‌పోర్ట్స్ సీజన్ 1 యొక్క అద్భుతమైన విజయం సాధించింది. 18 రాష్ట్రాలలో 120 మందికి పైగా మహిళా వ్యవస్థాపకులకు సాధికారత కల్పించి, ప్రపంచవ్యాప్తంగా 17% మహిళా నాయకులు విస్తరించడాన్ని చూసింది. ఆ అపూర్వ విజయం పై ఆధారపడి పయోనీర్, మహిళల నేతృత్వంలోని ఎస్ఎంబి లకు వారి ప్రపంచ విస్తరణ ప్రయాణంలో మద్దతు ఇవ్వడం కొనసాగించడం గర్వంగా ఉంది” అని పయోనీర్ – ఇండియా వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ షిసోడియా అన్నారు.
ఆస్పైర్ ఫర్ హర్ వ్యవస్థాపకురాలు & సీఈఓ మధుర దాస్ గుప్తా సిన్హా ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని నొక్కిచెబుతూ ” మా కార్యక్రమాల్లో పాల్గొన్న వారి వ్యాపారాలు అంతర్జాతీయ మార్కెట్లలో అభివృద్ధి చెందుతున్నట్లుగా మేము చూసినప్పుడు మా ప్రభావం యొక్క వాస్తవికత రాబోయే సంవత్సరాల్లో బయటపడుతుంది. సరైన మద్దతు , వనరులతో, మహిళలు నేతృత్వంలోని వ్యాపారాలు భారతదేశ ప్రపంచ ఆర్థిక కథను నడిపించగలవు మరియు నడిపిస్తాయి” అని అన్నారు.
భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ఇప్పటికీ 20% కంటే తక్కువగా ఉండటంతో, షీఎక్స్‌పోర్ట్స్ వంటి కార్యక్రమాలు మూడు కీలక రంగాలు : ప్రపంచ మార్కెట్ మేధస్సు, సరిహద్దుల వెలుపల ఆర్థిక అక్షరాస్యత , అంతర్జాతీయ వ్యాపార నెట్‌వర్క్‌లు- లో కీలకమైన అంతరాలను మూసివేస్తున్నాయి.
ఈ ఉత్సాహంతోనే, ఆస్పైర్ ఫర్ హర్ షీఎక్స్‌పోర్ట్స్ కార్యక్రమాన్ని మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది, దీనికి బలమైన పోస్ట్-ప్రోగ్రామ్ ఫ్రేమ్‌వర్క్ మద్దతు ఉంది. ఇందులో కొనసాగుతున్న మెంటర్‌షిప్, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అంతర్జాతీయ కొనుగోలుదారు-అమ్మకందారుల సమావేశాలు మరియు ప్రపంచ వాణిజ్య వ్యూహాలపై లోతైన వర్క్‌షాప్‌లు ఉన్నాయి, ఇవన్నీ 2025 నాటికి 1 మిలియన్ మహిళలు భారతదేశ అధికారిక ఆర్థిక వ్యవస్థలో చేరడానికి మరియు 2030 నాటికి 10 మిలియన్ల మంది మహిళలను చేరడానికి వీలు కల్పించాలనే ఆస్పైర్ ఫర్ హర్ యొక్క లక్ష్యంతో నేరుగా సరిపోతాయి.
ఎస్ఎంబిలను లావాదేవీలు చేయడానికి, వ్యాపారం చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి సాధికారత ఇచ్చే గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ పయోనీర్ (నాస్‌డాక్: PAYO) మరియు స్కేలబుల్ సర్వీస్ ఎగుమతులకు మద్దతు ఇచ్చే ప్లాట్‌ఫామ్ అయిన సీడ్ , ఈ పరివర్తన ప్రయాణంలో భాగస్వాములు. మహిళా వ్యవస్థాపకులు ఆలోచనలను మార్పిడి చేసుకోవడం, కొత్త బంధాలను ఏర్పరచుకోవడం మరియు వారి వ్యాపారాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ప్రేరణ పొందడంతో సాయంత్రం ఉత్సాహభరితమైన నెట్‌వర్కింగ్‌తో ముగిసింది.
షీఎక్స్‌పోర్ట్స్ యొక్క భవిష్యత్తు ఎడిషన్‌లపై ఆసక్తి ఉన్న మహిళా వ్యవస్థాపకులు మరింత తెలుసుకోవడానికి మరియు దరఖాస్తు చేసుకోవడానికి https://sheexports.afh.wgab.world/onboarding/1ని సందర్శించవచ్చు. ఈ సాధికారత కార్యక్రమంపై మరిన్ని వివరాలను తెలుసుకోవటానికి సోషల్ మీడియాలో @AspireForHerని అనుసరించండి.