Wednesday, December 24, 2025
E-PAPER
Homeఆటలుషెఫాలీ మెరుపులు

షెఫాలీ మెరుపులు

- Advertisement -

– శ్రీచరణి, వైష్ణవి మాయాజాలం
– రెండో టీ20లో శ్రీలంకపై
ఏడు వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం
విశాఖపట్నం:
ఏసీఏ -వీడీసీఏ మైదానంలో శ్రీలంక మహిళలతో జరిగిన రెండో టీ20లోనూ భారతజట్టు ఘన విజయం సాధించింది. తొలుత తెలుగు తేజం శ్రీచరణికి తోడు వైష్ణవి శర్మ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో శ్రీలంక జట్టు కేవలం 128 పరుగులకే పరిమితమైంది. ఆ లక్ష్యాన్ని భారత ఓపెనర్‌ షెఫాలీ వర్మ(69నాటౌట్‌; 34బంతుల్లో 11ఫోర్లు, సిక్సర్‌) ధనా ధన్‌ ఇన్నింగ్స్‌కి తోడు రోడ్రిగ్స్‌(26) బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడంతో కేవలం 11.5ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. 2వ వికెట్‌కు షెఫాలీ, రోడ్రిగ్స్‌ కలిసి 58పరుగులు జతచేసి గెలుపు తీరాలకు చేర్చారు. గెలుపుకు ఒక్క పరుగు దూరంలో ఉండగా హర్మన్‌ప్రీత్‌(10) ఔటయ్యింది. పవర్‌ ప్లే 6 ఓవర్లు ముగిసేసరికే భారతజట్టు వికెట్‌ నష్టానికి 68 పరుగులు చేసింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యతలో నిలువగా.. మిగిలిన మూడు టీ20లు తిరువనంతపురం వేదికగా జరగనున్నాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను తొలి ఓవర్లోనే క్రాంతి గాడ్‌ షాక్‌ ఇచ్చింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ విష్మీ గుణరత్నే(11)ను రిటర్న్‌ క్యాచ్‌ అందుకొని పెవీలియన్‌కు పంపింది. అనంతరం ఫోర్‌, సిక్సర్‌తో మెరుస్తున్న కెప్టెన్‌ చమరి ఆటపట్టు (31)ను స్నేV్‌ా రాణా ఔట్‌ చేసింది. మిడాన్‌లో పెద్ద షాట్‌ ఆడిన ఆటపట్టు క్యాచ్‌ను అమన్‌జ్యోత్‌ కౌర్‌ అందుకొని పెవీలియన్‌కు పంపింది. క్రాంతి, స్నేV్‌ా రాణా విజృంభణతో లంక టీమ్‌ పవర్‌ ప్లే లోనే రెండు వికెట్లు కోల్పోయింది. 38పరుగులకే రెండు వికెట్లు పడిన శ్రీలంకను హాసిన పెరీరా(22), హర్షిత సమరవిక్రమ(33) కలిసి ఆదుకున్నారు. శ్రీలంక 82పరుగుల వద్ద మూడో వికెట్లు కోల్పోగా.. 16ఓవర్లు ముగిసేసరికి 3వికెట్ల నష్టానికి 104 పరుగులతో పటిష్టంగా ఉన్నా.. చివర్లో స్పిన్నర్లు వైష్ణవి శర్మ, శ్రీచరణి లంకను కట్టడిచేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ షెఫాలీ వర్మకు దక్కింది. మూడో టీ20 శుక్రవారం జరగనుంది.

స్కోర్‌బోర్డు
శ్రీలంక మహిళల ఇన్నింగ్స్‌ : గుణరత్నే (సి అండ్‌ బి)క్రాంతి గాడ్‌ 1, ఆటపట్టు (సి)అమన్‌జ్యోత్‌ (బి)స్నేV్‌ా రాణా 31, పెరీరా (సి అండ్‌ బి)శ్రీచరణి 22, హర్షిత సమరవిక్రమ (రనౌట్‌) అమన్‌జ్యోత్‌/రీచా ఘోష్‌ 33, కవిషా దిల్హారి (సి)అమన్‌జ్యోత్‌ (బి)శ్రీచరణి 14, నీలాక్షి డి-శిల్వ (సి)శ్రీచరణి (బి)వైష్ణవి శర్మ 2, కౌషాణి (సి)రనౌట్‌)క్రాంతి గాడ్‌/రీచా ఘోష్‌ 11, షాషిని గింహానీ (సి)మంధాన (బి)వైష్ణవి శర్మ 0, కావ్యా కవింది (రనౌట్‌)శ్రీచరణి/రీచా ఘోష్‌ 1, మల్కి మదర (నాటౌట్‌) 1, అదనం 12. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 128 పరుగులు. వికెట్ల పతనం: 1/2, 2/38, 3/82, 4/104, 5/109, 6/121, 7/122, 8/126, 9/128 బౌలింగ్‌: క్రాంతి గాడ్‌ 3-0-21-1, అరుంధతి రెడ్డి 3-0-22-0, స్నేV్‌ా రాణా 4-1-11-1, అమన్‌జ్యోత్‌ కౌర్‌ 2-0-11-0, వైష్ణవి శర్మ 4-0-32-2, శ్రీచరణి 4-0-23-2.
ఇండియా మహిళల ఇన్నింగ్స్‌ : మంధాన (సి)కావ్య కవింది (బి)కవిషా దిల్హారీ 14, షెఫాలీ వర్మ (నాటౌట్‌) 69, జెమీమా రోడ్రిగ్స్‌ (సి)కవిషా దిల్హారి (బి)కావ్యా కవిందు 26, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (బి)మల్కీ మదార 10, రీచా (నాటౌట్‌) 1, అదనం 9. (11.5ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 129 పరుగులు. వికెట్ల పతనం: 1/29, 2/87, 3/128 బౌలింగ్‌: మదారా 2.5-0-22-1, కవింది 3-0-32-1, దిల్హారీ 2-0-15-1, రణవీరా 2-0-31-0, ఆటపట్టు 1-0-17-0, గింహానీ 1-0-12-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -