Sunday, March 22, 2026
E-PAPER
Homeకవితగూడు గోడు

గూడు గోడు

- Advertisement -

కూలుతున్నది నేను కాదు..
పేదోడి అర్ధాకలి..
ధ్వంసం అవుతున్నది
నేను కాదు
సెమట చుక్కల ఆవిరి..
పగులుతున్నవి
ఇటికెలు కాదు
బాధ్యతలు, ఆశలు..
రాలుతున్నవి సిమెంట్‌ పొరలు కాదు..
అస్తిపంజరంలా మారిన వెన్నముకలు..
ఒకప్పుడు నాలుగు కర్రల
చుట్టూ పాలిథిన్‌ కవర్‌ కప్పుకున్న రూపాన్ని..
ఓ కుటుంబం శ్రమ రూపాయిగా మారితే..
అందాల మేడనయ్యాను.. వాళ్లకు ఓ నీడనయ్యాను..
నేను నిలబడ్డ చోటుకి దిష్టి తగిలింది..
పాలకుడి కన్ను పడింది..
ఇంకేముంది.. భూదాన్‌
భూమి అంటూ బుల్డోజర్‌ నా మీదికి దూసుకొచ్చింది..
క్షణాల్లో ఆ నేల.. మట్టి దిబ్బల స్మశానమైంది..

  • ఏ. అజయ్ కుమార్‌, 8297630110
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -