నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్)
మంజీరా నది పరివాహక ప్రాంతంలో గోర్లను కాసేందుకు వెళ్లిన యువకుడు మంజీర నదిలో గల్లంతైన సంఘటన బీర్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు బీర్కూర్ గ్రామ శివారులో సోమవారం ఉదయం గొర్రెల కాపరి కోసం వెళ్లిన మేడే రవి అనే యువకుడు ప్రమాదవశాత్తు మంజీరా నదిలో అత్యధికంగా లోతుగా తవ్విన గోతుల పడి గల్లంతయ్యారు. గోర్లు చిందర వందరగా తిరగడం, గోర్లు కాసే వారు కనిపించక పోవడంతో స్థానికులు ఆ యువకుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.
చెక్ డ్యామ్ పేరిట బీర్కూర్ మంజీరా నదిలో గత ఐదేళ్లపాటు విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలన ఉల్లంఘించి అధిక లోతుతో ఇసుక తవ్వకాలు జరపడంతో, ఆ ఆ గోతులు యమపాశంగా మారాయి. ఇసుక క్వారీల నిర్వాహకులు లోతుగా తవ్విన గుంతల్లో పడి ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ విచ్చలవిడిగా మంజీరా నదిలో అక్రమ ఇసుక త్రవ్వకాలు ఆపాలని ప్రజలు కోరుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



