నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గొర్రెల కాపరులు తమ డిమాండ్ల పరిష్కారానికై రాజకీయాలకతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని జిఎంపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్, కార్యదర్శి ఉడుత రవీందర్ పిలుపునిచ్చారు.మంగళవారం రాయిగిరి లింగబసవ గార్డెన్లో జరిగిన గొర్రెలు,మేకల పెంపకందారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలకు ముఖ్య అతిథిలుగా హాజరై , మాట్లాడారు . గొర్లు, మేకలకు మేత,నీరు,వైద్యం,గొర్రెలకు ఉచిత భీమా,గొర్ల కాపరులకు 50సం.లకు పింఛన్లు,సబ్సిడీ రుణాలు,పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో,చదువుకున్న యువతీ,యువకులు ఉపాధి అవకాశాలు కల్పించాలని అమరజీవి దొడ్డి కొమురయ్య పోరాట స్పూర్తితో పోరాడాలన్నారు.గొల్ల కుర్మల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం అన్నారు.అధికారం చేపట్టిన వంద రోజుల్లో గొల్ల కురుమలకు రెండు లక్షల రూపాయలు నగదు బదిలీ చేస్తామని కామారెడ్డి బిసి డిక్లరేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టో 15,16 పేజిలలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 18 నెలలు అయినా అమలు చేయలేదని,పదేళ్లుగా సొసైటీలకు ఎన్నికలు జరపలేదని,రెండున్నర సం.లుగా గొర్రెలు,మేకలకు డీవార్మింగ్,8నెలలుగా మందుల సరఫరా పూర్తిగా నిలిచి పోయిందని,తొమ్మిది నెలలుగా గోపాలమిత్రలకు వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు.రోగాలతో గొర్లు మేకలు చనిపోతున్నాయని ప్రభుత్వం నుండి ఎలాంటి మందులు అందడం లేదని
పోరాటాల ద్వారానే పరిష్కారం అవుతాయని అన్నారు.దయ్యాల నర్సింహా అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆలేటి యాదగిరి,ఉమ్మడి జిల్లా డైరెక్టర్లు కల్లూరి మల్లేష్, బండారు నర్సింహ్మ,జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు,బొమ్మల రామారం సింగిల్ విండో చైర్మన్ గూదె బాలనర్సయ్య,జిల్లా వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ బొలగాని జయరాములు, వడ్డెబోయిన వెంకటేష్, ఈర్లపల్లి ముత్యాలు ఉపాధ్యక్షులు బుడుమ శ్రీశైలం,సహాయ కార్యదర్శి కొండె శ్రీశైలం, మద్దెపురం బాలనర్సయ్య,బుగ్గ చంద్రమౌళి, జోగు శ్రీనివాస్, ర్యాకల శ్రీనివాస్,కడెం బీరప్ప, పాక జహాంగీర్, దేవునూరి బాలయ్య, క్యాసాని నవీన్, నరాముల గణేష్, నారి వెంకటేష్, నారి మల్లేష్, బీమనబోయిన బాలరాజు పాల్గొన్నారు.