Friday, July 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశిల్ప మరణం బాధాకరం

శిల్ప మరణం బాధాకరం

- Advertisement -

– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని
– దశదిన కర్మకు హాజరైన నవతెలంగాణ ఖమ్మం సిబ్బంది
– ప్రజాశక్తి ఫొటోగ్రాఫర్‌ రమణకు పోతినేని, జూలకంటి పరామర్శ
నవతెలంగాణ-ఖమ్మం రూరల్‌

ప్రజాశక్తి ఫొటోగ్రాఫర్‌ రమణ భార్య శిల్ప అనారోగ్యంతో చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం ఆరెకోడు గ్రామంలో తిప్పసముద్రంలో శనివారం జరిగిన శిల్ప దశదిన కర్మ కార్యక్రమానికి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌ రావు హాజరై శిల్ప చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిల్ప భర్త, ప్రజాశక్తి ఫొటోగ్రాఫర్‌ వెంకటరమణకు తమ సానుభూతి తెలిపారు. మనోధైర్యాన్ని కలిగి ఉండాలని, ఇద్దరి పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. నవతెలంగాణ ఖమ్మం సిబ్బంది కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు నండ్ర ప్రసాద్‌, నవతెలంగాణ సిబ్బంది కొత్తపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, వీరేష్‌, గుమ్మడి నరసయ్య, ఉపేందర్‌, ఏపూరి వర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -