Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఆటలుసమిష్టిగా మెరిసి..

సమిష్టిగా మెరిసి..

- Advertisement -

– ఆసీస్‌-ఏపై వన్డే సిరీస్‌ వశం
బ్రిస్బేన్‌ (ఆస్ట్రేలియా) : భారత్‌-ఏ అమ్మాయిలు కంగారూ గడ్డపై కదం తొక్కారు. బ్యాట్‌తో, బంతితో సమిష్టి ప్రదర్శన చేసిన అమ్మాయిలు మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సొంతం చేసుకున్నారు. 266 పరుగుల లక్ష్యాన్ని భారత్‌-ఏ 49.5 ఓవర్లలో ఛేదించి 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్‌ యస్టికా భాటియా (66, 71 బంతుల్లో 9 ఫోర్లు), రాధ యాదవ్‌ (60, 78 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), తనుజ కన్వార్‌ (50, 57 బంతుల్లో 3 ఫోర్లు) అర్థ సెంచరీలతో రాణించారు. ప్రేమ రావత్‌ (32 నాటౌట్‌) సైతం ఆఖర్లో కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. షెఫాలీ వర్మ (4), ధార గుజ్జర్‌ (0), మిన్నూ మణి (0), రఘ్వీ బిస్త్‌ (14), తేజల్‌ (19) నిరాశపరిచినా.. భారత్‌-ఏ మరో బంతి ఉండగానే విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా-ఏ అమ్మాయిలు 50 ఓవర్లలో 9 వికెట్లకు 265 పరుగులు చేశారు. అలీసా హీలే (91, 87 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సహా కిమ్‌ గార్త్‌ (41), హేవర్డ్‌ (28) రాణించారు. సిరీస్‌లో మూడో మ్యాచ్‌ బ్రిస్బేన్‌లోనే ఆదివారం జరుగనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad