Monday, July 14, 2025
E-PAPER
Homeఆటలుమెరిసిన షెఫాలీ

మెరిసిన షెఫాలీ

- Advertisement -

ఐదో టీ20లో ఇంగ్లాండ్‌ గెలుపు
బర్మింగ్‌హామ్‌
: సిరీస్‌ చేజారినా.. ఆతిథ్య ఇంగ్లాండ్‌ ఊరట విజయం దక్కించుకుంది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన భారత్‌, ఇంగ్లాండ్‌ మహిళల ఐదో టీ20లో ఆతిథ్య జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ఆఖరు బంతికి ఛేదించింది. ఓపెనర్లు డానీ (56, 37 బంతుల్లో 9 ఫోర్లు), సోఫియా (46, 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) సహా టామీ (30, 20 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. దీప్తి శర్మ (2/31), అరుంధతి రెడ్డి (2/47) మెరిసినా.. భారత్‌కు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. డబ్ల్యూపీఎల్‌ ఫామ్‌తో ఇంగ్లాండ్‌ టూర్‌కు వచ్చిన షెఫాలీ వర్మ.. 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 3-2తో టీమ్‌ ఇండియా గెల్చుకుంది. పది వికెట్లతో మెరిసిన తెలుగమ్మాయి శ్రీ చరణి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -